Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ప్రముఖ సాంస్కతిక, సేవా సంస్థ మయూరి ఆర్ట్స్ నిర్వహణలో శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై 'కళా నీరాజనం' పేరిట వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదుకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకూ పన్నెండు గంటల నిర్విరామ నత్య కార్యక్రమాలు జరిగాయి. 120 మంది కళాకారులు 12 బందాలుగా 12 సంప్రదాయ నత్యాంశాలను 60 నిమిషాల్లో నర్తించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా కో ఆర్డినటర్ బింగి నరేంద్ర పాల్గొని మాట్లాడుతూ ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు ప్రతిభభావంతులన్నారు. ఇచ్చిన సమయంలో నత్యాలు పూర్తి చేసినందున వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు ఇనట్లు ప్రకటించారు. నాట్య గురువులు రామాదేవి, పేరిణి సంతోష్, మాయా శారద, మాధురి, రాణి ప్రియ, సరైశ్వర్, నాగ శ్రీ, కిరణ్ కుమార్ చారి, ఎన్. నాగశ్రీ లకు రికార్డ్ ధ్రువ పత్రాలను బహుకరించారు. మయూరి రాధ కార్యక్రమానికి వ్యాఖ్యానం చేయగా సంస్థ డైరెక్టర్లు దత్తు, సాయి ప్రియ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. ముగింపు ఉత్సవానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్. వేణుగోపాలచారి పాల్గొని మాట్లాడుతూ పోటీలలో పాల్గొనే కళాకారులకు క్రమ శిక్షణ, ఏకాగ్రత అలవడతాయని, రికార్డులో నమోదు కావటం వారికి మంచి గుర్తింపు అని అభినందించారు.