Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
మన బస్తీ మన బడి కార్యక్రమంపై పాఠశాలల యాజమాన్యంతో చర్చ
నవతెలంగాణ-అంబర్‌పేట
మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధి చెంది రూపురేఖలు మారిపోతాయని ఎమ్మెలేఓ్య కాలేరు వెంకటేష్ అన్నారు. గోల్నాకలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్‌తో మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టాల్సిన అభివద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివద్ధి కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన మన బస్తీ మన బడి పథకంలో భాగంగా సుమారు రూ. 3.50 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. ప్రతి పాఠశాలకు బెంచీలు, బోర్డులు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించి చక్కటి వాతావరణం కల్పిస్తామని అన్నారు.. పాఠశాల వారీగా అవసరమైన ప్రతిపాదనలను పంపాలని ప్రిన్సిపాల్స్‌ను కోరారు. డీఈఓ శ్రీధర్, నిజాముద్దీన్ విద్యాశాఖ ఏఈ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసి పేద ప్రజలకు కార్పొరేటర్ వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ అమతతో కలిసి తిలక్‌నగర్‌లోని అర్బన్ ప్రయిమరీ హెల్త్ సెంటర్లో నియోజకవర్గంలోని ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం అధికారులతో పాదయాత్ర చేపట్టిన నియోజకవర్గంలో జరుగుతున్న అభివద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జుమ్మిడి వెంకట్, డాక్టర్ దీప్తి పటేల్, డాక్టర్ హర్షిత, ఎన్.కె.జ్యోతి, నర్స్ కమలా, పీహెచ్ఎంలు దేవకి, పద్మ, ఆశా వర్కర్లు కల్పన, గీత, మంజుల, అనిత, మల్లేశ్వరితో పాటు ఇతర వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.