Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
గాంధీ సాక్షిగా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని అవాజ్ సౌత్ జిల్లా కమిటీ కార్యదర్శి అబ్దుల్ సత్తార్ అన్నారు. ఐఎస్ సదన్‌లోని సౌత్ కమిటీ ఆధ్వర్యంలో లో గాంధీ విగ్రహం వద్ద వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. తక్షణమే మైనారిటీలకు బడ్జెట్లో రూ. 5 వేల కోట్లు వెంటనే కేటాయించాలన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం కషి చేయాలన్నారు. వారి అభివద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలుపరచాలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అన్వర్ ఖాన, అక్తర్ బేగం, మహమ్మద్ కరీం తదితరులు పాల్గొన్నారు.