Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
హాస్య రస పోషణకు మారు పేరు అలీ అని, ఒకప్పుడు ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని రాష్ట్ర శాసనసభ తొలి సభాపతి ఎస్. మధుసూదనా చారి కొనియాడారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి నిర్వహణలో భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో శోభన్ బాబు జయంతి సందర్భంగా నటుడు అలీకి రజిత కిరీట ధారణ వేడుక నిర్వహించారు. మధుసూదనాచారి పాల్గొని అలీని సత్కరించి మాట్లాడారు. కుటుంబ సుమేతంగా చూడదగ్గ సినిమాల్లో నటించిన శోభన్ బాబు తరం దాటి పోయిందని మంచి చిత్రాలు నేడు తక్కువగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు సుధాకర్ బాబు మాట్లాడుతూ క్రమ శిక్షణకు శోభన్ బాబు, అలీలు గుర్తింపు తెచ్చుకున్నారని వివరించారు. సంఖ్య శాస్త్ర వేత్త దైవజ్ఞ శర్మ మాట్లాడుతో అలీ పలువురికి సహాయపడే కార్యక్రమాలు నిర్మావశించే ఉత్తమ వ్యక్తి అని కొనియాడారు. వేదిక పై సంస్థ చైర్మెన్ రామకష్ణ స్వాగతం పలుకగా అద్యక్షులు పద్మారావు, కార్యదర్శి లాలబహదూర్ శాస్త్రి సంస్థ నివేదిక సమర్పించారు. దర్శకుడు రేలంగి నరసింహారావు అలీ చిన్న తనంలోనే నటనలో ప్రశంసలు పొందారని గుర్తు చేశారు. ప్రముఖ గాయని ఆమని సహగాయకులు సుభాష్, పవన్ లతో పాడిన పాటలు అక్షట్టుకొన్నాయి. శ్రావణి, ఝాన్సీ శ్రీనివాస్ తదితరులు పాలు పంచుకున్నారు.