Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న గృహాలకు విద్యుత్ మీటర్లను మంజూరు చేయవద్దని సీపీఐ గాజులరామారం డివిజన్ కార్యదర్శి సదానంద్ అన్నారు. సోమవారం గాజులరామారం డివిజన్ విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ సత్యనారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. గాజులరామారం డివిజన్లోని 326, 307, 342, 329 సర్వే నంబర్లలో ప్రభుత్వ స్థలాలో అక్రమంగా ఇండ్లు నిర్మిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడెందుకు తమ వంతుగా మీటర్లను జారీ చేయవద్దని తెలిపారు. ఈ విషయమై రెండు, మూడు రోజులలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వెంకటేష్, సాయిలు, యూసుఫ్, రాములు తదితరులు పాల్గొన్నారు.