Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నిరుపేదలకు సేవలు అందించడం గొప్ప వరమని వికలాంగులతో పాటు పేద విద్యార్థులకు, పేద మహిళలకు తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ గాంధీనగర్ అధ్యక్షులు, లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్‌రెడ్డి సేవలు అభినందనీయమని బీజేపీ మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు పన్నాల హరీష్‌రెడ్డి కొనియాడారు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డినగర్ డివిజన్ శివాజీ చౌక్‌లో శివాజీ సేవా సమితి అధ్యక్షులు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్ అధ్యక్షతన జరిగాయి. పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఛత్రపతి శివాజీ జాతీయ పురస్కారం 2022 బహుమతులను ప్రదానం చేశారు. అందులో భాగంగా గత కొన్నేండ్లుగా సామాజిక సేవలు అందిస్తున్న లయన్ రాజశేఖర్‌రెడ్డిని ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జాతీయ పురస్కార్ 2022 అవార్డును పన్నాల హరిష్‌రెడ్డి శాలువాతో సన్మానించి మెమోంటోను ప్రదానం చేశారు.