Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఈఓ విజయకుమారికి ట్రస్మా సభ్యుల వినతి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రయివేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా ట్రస్మా సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారికి ట్రస్మా ప్రతినిధుల బృందం వినతి పత్రం అందజేశారు. సోమవారం కూకట్‌పల్లిలోని పీఎన్ఎం స్కూల్లో ట్రస్మా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డీఈఓ విజయకుమారి హాజరయ్యారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదేశాలనుసారం రెండేండ్ల పాఠశాలలు మూసి వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ప్రాపర్టీ టాక్స్ తీసివేయాలని, విద్యుత్ , నీటి బిల్లులు మినహయించాలని, పాఠశాలలకు ట్రేడ్ లైసెన్స్ లేకుండా చూడాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూధన్, సంయుక్త కార్యదర్శి కె,ఇన్నారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సిద్దల బీరప్ప, ట్రస్మా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె.ఉమా మహేశ్వర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జె.నాగరాజు, కోశాధికారి ఎండి. అజార్‌ఖాన్, పలు పాఠశాలల కరస్పాండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.