Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్లో పెండింగ్‌లో ఉన్న అభివద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. సంబంధిత విషయమై సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఇంజినీర్ నాగేందర్, అసిస్టెంట్ ఇంజినీర్ రాజ్ కుమార్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని కావేరి నగర్ కల్వర్టు విసాతత్ ఎంక్లేవ్ కల్వర్టు పనులు, కుమ్మరి కుంట నుంచి ఆదర్శనగర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ వరకు, రాఘవేంద్ర నగర్ నుంచి సీతారామ కాలనీ వరకు జరుగుతున్న వాటర్ పైప్ లైన్ తదితర అభివద్ధి పనులపై సమీక్షించారు. మోడల్ శ్మశాన వాటిక డిజైన్‌పై చర్చించారు. బీరప్పగడ్డ, న్యూ ప్రశాంత్ నగర్, సౌత్ ప్రశాంత్ నగర్లో ఓపెన్ డ్రయినేజీ సరిగ్గా లేదని వాటిని పునర్నిర్మించేందుకు ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయాలని అధికారులను కోరారు.. ఇప్పటికే నిధులు మంజూరై ప్రారంభం కాని అభివద్ధి పనులను టెండర్ కోడ్ చేసి వెంటనే ప్రారంభించాలని సూచించారు.