Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని అన్ని బస్తీ లు కాలనీల అభివద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నట్లు మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో సీసీ రోడ్స్, కమ్యూనిటీ హాల్, రిటైనింగ్ వాల్‌ను శాంక్షన్ చేయించిన సందర్భంగా స్థానికులు కార్పొరేటర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పర్యటనలో భాగంగా 58, 59 జీఓలో ల్యాండ్‌ను రెగ్యులరైజేషన్ ప్రతి ఒక్కరికి అయ్యేలా చూడాలని కార్పొరేటర్‌కు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ58, 59 జీవో ప్రకారం బస్తీవాసులకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ కొరకు దరఖాస్తులు రెడీ చేసుకుంటే బస్తీ తరఫున మల్కాజిగిరి ఎమ్మార్వోతో స్వయంగా మాట్లాడి వారందరికీ లబ్ది చేకూరేలా అన్ని విధాలుగా సహకరిస్తానన్నారు. డివిజన్ అభివద్ధికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్, జిలని, వేణు యాదవ్, శ్రీకాంత్, సునీల్ యాదవ్, సారంగ్, కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.