Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్లో బస్ టెర్మినల్ వెంటనే నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్చేశారు. ఈమేరకు సోమవారం ఉప్పల్ ప్రధాన రహదారిపై మహంకాళి ఆలయం నుంచి ఏసియన్ థియేటర్ వరకు కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తన హయాలో జరిగిన ఎలివేటెడ్ కారిడార్, అనేక పనులు గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక ఎమ్మెల్యేపై మండిపడ్డారు. కార్యక్రమంలో హబ్సిగూడా కార్పొరేటర్ చేతన, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి, ఉప్పల్, చిల్కానగర్ అధ్యక్షులు రెడ్డిగారి దేవేందర్ రెడ్డి, గోనె శ్రీకాంత్ ముదిరాజ్, ఉప్పల్ సర్కిల్ బీజేపీ సీనియర్ నాయకులు మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్, సోమశేఖర్ గౌడ్, రేవు నర్సింహా, కల్యాణం గీత రాణి, గోనె అంజయ్య, కొల్లు బాలరాజ్ కురుమ, మేకల శిల్పా రెడ్డి, రెవెళ్లి రాజు, ఏసురి యాదగిరి, మర్నేని ఫణీంద్ర, వెంకట్ రెడ్డి, బండి పద్మా పాల్గొన్నారు.