Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కష్టాలు, కన్నీళ్లు జీవితంలో ఉన్న ప్రతి మనిషిని పలకరిస్తే గొప్ప కథ దొరుకుతుందని ప్రముఖ వక్తలు అన్నారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో మంగళవారం భాండారి సాహితీ సాంస్కతిక సమాఖ్య నిర్వహణలో భాషా సాంస్కతిక శాఖ నవతెలంగాణ ప్రచురణల సంస్థ సౌజన్యంలో భాండారి అంకయ్య రచించిన 'నాలో నేను' ఆత్మకథ గ్రంథ ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ అంకయ్య జీవిత చిత్రం ఈ గ్రంథమన్నారు. ఒక వ్యక్తి కష్టాలను ఎదిరించి ఎలా ఉన్నత స్థాయికి చేరుకోగలరని నిరూపించిన కథ చదివిన వారికి స్ఫూర్తి నిస్తుందని వివరించారు. మామిడి హరికష్ణ మాట్లాడుతూ తెలంగాణ మట్టి ముట్టుకొంటె కథ, మనిషిని తడితే సినిమా అవుతుందని అభివర్ణించారు. అంకయ్య నిరంతర సాహితీ కషీవాలుడని, 70 ఏండ్ల సుదీర్గ జీవితంలో ఎన్నో మలుపులు, మెరుపులు ఉన్నాయని అవి అన్నీ నాలో నేను ఆత్మ కథలో కనిపిస్తాయని అన్నారు. ఆయన నిరంతర విద్యార్థి అని ప్రశంసించారు. హైద్రాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్ర మోహన్ మాట్లాడుతూ అంకయ్య జీవిత కథ ప్రతి వారూ తెలుసుకోవాలని ఆత్మ విశ్వాసం వస్తుందని అన్నారు. కథలా చివరి కంట చదివిస్తుందని తెలిపారు స్వాగతం పలికిన ఏసీపీ( హన్మకొండ) డాక్టర్ ఎమ్ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ అంకయ్య ఏ పనిచేసిన చిత్తశుద్ధితో చేస్తారన్నారు. వయస్సుపై బడుతున్నా సామాజిక చింతనతో ఏదో చేయాలన్న తపన ఆయనను నడిపిస్తోందని అన్నారు. అనుభవాల సారమే ఈ గ్రంథమన్నారు. మడిపల్లి దక్షిణామూర్తి వ్యాఖ్యానం చేసిన సభలో భాండారి కష్ణ, తదితరులు పాల్గొన్నారు. నలిమెల భాస్కర్, టీ. రఘోత్తమ రెడ్డిలను సత్కరించారు. రామకష్ణ వందన సమర్పణ చేశారు.