Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగాగా పని చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ బోసు రాజు పేర్కొన్నారు. మంగళవారం రామ్ జై జై కాంగ్రెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ అనిల్ కుమార్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సూచించారు. ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి అని వాటి కొనసాగింపులో భాగంగా అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ముఖ్యంగా యువత మహిళల్లోకి తీసుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సోహెల్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కవిత, రాంనగర్ అధ్యక్షులు సయ్యద్ జుబేర్ హుస్సేన్, ముషీరాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగ పాక వెంకట్, ఏ బ్లాక్ అధ్యక్షులు వీడియో కష్ణ సీనియర్ నాయకులు గుర్రం సెంటర్ సురేష్ యాదవ్ జి ఎం కేశవ్ పాశం అనిల్ యాదవ్ లోకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.