Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్దీకరణ చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం 58, 59 జీవోలకు సంబంధించి మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్, కూకట్పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 58, 59 జీవోలకు సంబంధించి అన్ని వివరాలు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125 గజాల కంటే ఎక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ధరలకు అనుగుణంగా నాల్గో వంతు రిజిస్ట్రేషన్ చార్జిలుంటాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి ద్వారా కూకట్పల్లి నియోజకవర్గంలో 12 పాఠశాలలను పూర్తి స్థాయిలో అత్యాధునిక సదుపాయాలతో చేపట్టేందుకు ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపినట్లు తెలిపారు. క్రమబద్దీకరణ కాని స్థలాలకు సంబంధించి ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకరాగా స్పందించి కలెక్టర్ త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయని తెలిపారు.