Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్ పల్లి
ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవ చేస్తానని, నా జీవితం ప్రజాసేవకే అంకితమని కూకట్ పల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్ ఛార్జ్ మాధవరం కాంతారావు అన్నారు. మంగళవారం మాధవరం కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని, ప్రతి డివిజన్లో స్థానిక నాయకులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూకట్ పల్లిలో నిర్వహించిన జన్మదిన వేడుకలు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాందేవ్ రావు ఆస్పత్రిలో బీజేపీ నాయకులు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కూకట్ పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు, బాలాజీ నగర్ లోని ఆలంబన అనాధాశ్రమం లోనీ చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకుని, చిన్నారులకు పుస్తకాలు,పెన్ను లు, ప్యాడ్లు అందజేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూకట్ పల్లి దయర్ గూడ లోని ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు ప్యాడ్స్ పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినీ విద్యార్థులకు 3 వేల పుస్తకాలు వేయి ప్యాడ్స్ పెన్నులను పంపిణీ చేశారు.