Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఆర్డీవో మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీవీహెచ్ఎస్ మూర్తి
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థులు సైన్స్ పట్లా అవగాహన పెంపొందించుకోవాలని డీఆర్డీవో మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీవీహెచ్ఎస్ మూర్తి అన్నారు. తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో సైన్స్ వారోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆజాదీ కా అమత్ మహోత్సవ్‌లో భాగంగా 'ఫెస్టివల్ ఆఫ్ స్కోప్ (సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్) ఫర్ ఆల్' పేరుతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది పేరున్న గొప్ప శాస్త్రవేత్తలు జన్మించి, తమ సేవలతో దేశానికి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. వారిలో కొంత మంది పేర్లు మాత్రమే ప్రజలకు తెలుసని, అందరి పేర్లను ప్రజలు, విద్యార్థులు, యూత్, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులను శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 75 ఎంపిక చేసిన కేంద్రాలలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని వాటిలో ఒకటి ఎన్ఐఎన్, మరొకటి వరంగల్‌లోని ఎన్ఐటీ అని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పరిశోధనా సంస్థలు ఎంతో శ్రమించాయని కొనియాడారు. ఎస్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. హేమలత మాట్లాడుతూ దేశంలో విటమిన్ ఏ లోపం, ఐరన్ లోపం, పోషకాహార లోపాలను నిర్మూలించేందుకు తమ సంస్థ చేసిన కషిని వివరించారు. వేడుకల కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్‌ఎఎన్ శాస్త్రవేత్త డాక్టర్ జి. భానుప్రకాశ్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలైన డీఎస్, డీబీటీ, సీఎస్ఐఆర్, ఎంవోఈఎస్, డీవోఎస్, ఇస్రో, డీఏఈ, ఐసీఎంఆర్, డీఆర్డీవో, ఏఐసీటీఈ, ఇగ్నో, ఇస్రో తదితర సంస్థలతో కలిసిఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏడు రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అంశంపై ఈ వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించేందుకు ఈ వేడుకలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వారం రోజుల్లో వివిధ థీమ్స్ పై ప్రసంగాలు ఉంటాయి అని చెప్పారు.