Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
రోడ్లను అభివృద్ధి పరిచి స్ధానికులకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. కాచిగూడ డివిజన్ మసీద్ ఈ అజీమియాలోని లెజెండ్ అపార్ట్మెంట్ వద్ద (రెడ్డి కాలేజ్ ఎదురు లేన్)లో రూ.19 లక్షలతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేష్‌యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శిరీషయాదవ్, డాక్టర్ ఓం ప్రకాష్యాదవ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటికపుడు వివిధ శాఖల అధికారులతో కలిసి పాదయాత్రలు చేపడుతూ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రయినేజీ సమస్యల సత్వర పరిష్కారానికి పాటుపడుతున్నాయమని అన్నారు. బస్తీలో వాహనాల అతి వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం బస్తీలో పాదయాత్ర నిర్వహించి స్ధానిక సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ సంపత్, వాటర్ వర్క్స్ డీజీఎం సన్యాసిరావు, విద్యుత్ శాఖ డీఈ వెంకట రమణారెడ్డి, ఎస్ఎఫ్ఐ ఇన్ఛార్జ్ తిరుపతి నాయక్, టీఆర్ఎస్ కాచిగూడ డివిజన్ అధ్యక్షుడు భీష్మ, దత్రిక్ నాగేందర్ బాబ్జి, కార్యదర్శి సదానంద్ తదితరులు పాల్గొన్నారు.