Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓయూ పరిపాలన భవన్ ఎదుట విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల హాస్టల్ మార్పుతో క్యాంపస్‌లో గందరగోళం మొదలైంది. ఏకపక్షంగా హాస్టల్ వదిలివెళ్లాలని ఓయూ వీసీ, అధికారులు ఆదేశించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూలో నూతనంగా విద్యార్థినుల అడ్మిషన్స్ పెరగడంతో వారికి లేడీస్ హాస్టల్ ఏ మాత్రం సరిపోని పరిస్థితి తలెత్తింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ దారుల కోసం అన్వేషించారు. అందులో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ హాస్టల్‌ను విద్యార్థినులకు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో ఓయూ వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీలు మంగళవారం ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు వెళ్లి వసతిగహన్ని ఖాళీ చేయాలని కోరారు. దానితో ఆ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ హాస్టల్ ఏకపక్షంగా, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యార్థినులకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. హాస్టల్ మార్పు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పరిపాలనా భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వినోద్, సతీష్ గౌడ్, రాజేష్, జీవన్, నాగయ్య, రవీందర్, వెంకట్, ప్రవీణ్, నాగరాజు పాల్గొన్నారు.