Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్ ప్రజలకు సూచించారు. మంగళవారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని తండాలో కౌన్సిలర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో అరుంధతి ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ పి. భోగేశ్వర్లు తో కలిసి ప్రారంభించారు. వైద్య శిబిరంలో భాగంగా బిపి షుగర్, కంటి పరీక్షలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో 100 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. రోగ నిర్ధారణ పరీక్షలు అవసరం ఉన్నవారికి మళ్లీ ప్రత్యేకంగా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స వైద్యసేవలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అరుంధతి హాస్పిటల్ డీన్ డాక్టర్ ఉదరు కుమార్, ఎన్ఎస్ఎస్స్ జిల్లా నోడల్ అధికారి నాయిని ఉదరు రంజన్ గౌడ్, అంజనా ఆస్పత్రి నిర్వాహకులు, వివిధవిభాగాల వైద్యులు, స్థానిక నాయకులు అమర్‌సింగ్ నాయక్, హనుమంతు, శాంతా ప్రవీణ్ నాయక్, స్వామి నాయక్, గోపాల్ నాయక్ పాల్గొన్నారు.