Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీడీఎస్యూ (విజంభణ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లూరి విజరు
నవతెలంగాణ-ఓయూ
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల ప్రస్తావనే లేకపోవడం బాధకరమైన విషయమని పీడీఎస్యూ (విజంభణ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లూరి విజరు అన్నారు. మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా తొంభై రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల చావులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ బోర్డ్ నిద్రావస్థలో ఉందని, ఇప్పటికైనా నిద్ర లేచి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని, లేకపోతే వేలాది మంది విద్యార్థులతో టీఎస్పీఎస్సీ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ (విజంభణ) సిటీ కన్వీనర్ దుర్గం దిలీప్, ఓయూ నాయకులు కిరణ్, అఖిల్, గోపాల్, రాఘవేంద్ర, కల్యాణ్, కిషోర్, నగేష్, చిన్న పాల్గొన్నారు.