Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్‌ను సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. మంగళవారం సీతాఫలమండీ డివిజన్ పరిధిలో దాదాపు రూ.80 లక్షలతో చేపడుతున్న వివిధ అభివద్ధి పనులను కార్పొరేటర్ సామల హేమ, అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. సికింద్రాబాద్ పరిధిలో 5 దశాబ్దాల కాలంలో చేపట్టని పనులను కేవలం ఐదేండ్లలో పూర్తిచేశామని తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బందుల నివారణకు చేపట్టిన ఏర్పాట్లు మంచి ఫలితాలు అందిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా చిలకలగూడ బడీ మసీద్ నుంచి కింది బస్తి, వీరయ్య గల్లి, ఉప్పరి బస్తి, ఫ్రైడే మార్కెట్, మార్కండేయ నగర్, బ్రాహ్మణా బస్తి తదితర ప్రాంతాల్లో పాద యాత్రను నిర్వహించారు. భవానీ నగర్ నుంచి కింది బస్తీ మీదుగా బౌద్దనగర్‌లోని వివిధ ప్రాంతాల వరకు సాగే ప్రధాన నాలా పూడిక తీసివేత పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఇంజినీరింగ్ అధికారి ఆశాలత, జలమండలి డీజీఎం వై.కష్ణ, అధికారులు రఘు, అన్విత్ కుమార్, మధురిమ, యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు పాల్గొన్నారు.