Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రతి చిన్నారికి ఈ నెల 27న పల్స్ పోలియో చుక్కలు చిన్నారులకు వేయించాలని ఇసామియా బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ స్నేహిక అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఇసామియా బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో లో 32 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 ఏండ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. 28 నుంచి ప్రతి ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు ఇస్తారని తెలిపారు. సమావేశంలో పీహెచ్ ఎన్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.