Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ కె. మురళీధర్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో వెలుగు చూసిన నకిలీ సర్టిఫికెట్ల కేసును ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్)కు అప్పగిస్తున్నట్లు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ కె. మురళీధర్ తెలిపారు. కాచిగూడ ఏసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆడిషినల్ డీసీపీ మురళీధర్ కేసు వివరాలను వెల్లడించారు. ముద్దం స్వామి అనే వ్యక్తి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుతున్నాడని, అతనితో పాటు, అతని సర్టిఫికెట్ అసలైనదేనని ధృవీకరించిన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ముద్దం స్వామి ప్రస్తుతం న్యూయార్క్‌లోని పేస్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్‌కు సీపీ ఆదేశించారని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించిన స్థానిక పోలీసులు సోమవారం రాత్రి ఐపీసీ 467, 471, 420 సెక్షన్ల కింద క్రైం నెంబర్ 87/2022తో కేసు నమోదుచేశామన్నారు. తదుపరి విచారణ కోసం కేసును సిట్ బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్, ఓయూ డీఐ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఓయూ అధికారులు కనీసం ఫిర్యాదు చేయకపోవడం శోచనీయం.