Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-దుండిగల్
నియోజకవర్గ ప్రజల మౌలిక వసతులు కల్పిస్తూ వారి అభివద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. మంగళవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీ నగర్ కమాన్ వద్ద దాదాపు 13.04 కోట్లతో, బండారు లే అవుట్ రోడ్ నెంబర్ 3 కమ్యూనిటీ హాల్ వద్ద దాదాపు 9.55 కోట్లతో స్ట్రామ్ వాటర్ లైన్ డ్రైన్ సిస్టమ్ పనులను మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటు ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి కాలనీలో ప్రజా అవసరాలను దష్టిలో ఉంచుకుని కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ శంకరయ్య, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు ఆవుల పావని జగన్ యాదవ్, రవి కిరణ్, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, ప్రణయ ధనరాజ్ యాదవ్, జ్యోతి నరసింహ రెడ్డి, బొర్రా దేవి చందు, విజయలక్ష్మి సుబ్బారావు, గాజుల సుజాత, రాఘవేంద్ర రావు, కోలన్ వీరేందర్ రెడ్డి, రజిత రవికాంత్, రాజేశ్వరి చౌదరీ, కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి, తలారి వీరేష్ ముదిరాజ్, వాణి, నాయకులు ఆవుల జగన్ యాదవ్, కోలన్ సునీల్ రెడ్డి, వెంగయ్య చౌదరీ, ఆవుల జగదీష్ యాదవ్, చంద్రగిరి సతీష్, నరసింహ రెడ్డి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.