Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ భూక్జాల విషయంలో నిజాయితీని నిరూపించుకునేందుకు అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కన్నె ప్రకాష్ డిమాండ్ చేశారు. బుధవారం ఓల్డ్ బోయిన్పల్లి అంజయ్యనగర్‌లోని తన పార్టీ కార్యాలయంలో విలేకర్ల మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కబ్జాలు జరగడం లేదనడం సరికాదన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో ఉన్న హస్మత్ పేట చెరువు సర్వే నెంబరు ఒకటిలో ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేశారో, సర్వే నెంబరు 57లో మానస హైట్స్ ఎదురుగా ఉన్న స్థలాలు ఎవరు కబ్జా చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మాధవరంపై ఉందన్నారు.