Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థి, అధ్యాపక, ఉద్యోగ, కార్మికుల వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఓయూ వీసీ ప్రొ.రవీందర్ యాదవ్‌ను రీ కాల్ చేయాలంటే కొందరు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని బహుజన విద్యార్ధి సంఘాలు నేతలు అన్నారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఓయూ వీసీ ప్రొ.రవీందర్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ విద్యార్థి, అధ్యాపక, ఉద్యోగుల, కార్మికుల వ్యతిరేకమే అని అన్నారు. ఈ నిర్ణయాలను వీసీకి సంబంధించిన కొందరు సమర్ధిస్తూ మాట్లాడడం అంటే అది వారి అవివేకానికి నిదర్శనమే అవుతుందన్నారు. ఓయూ వీసీ సామాజిక వర్గానికి చెందిన కొందరు సామాజిక మాధ్యమాల్లో వీసీ తప్పుడు నిర్ణయాలపై పోరాటం చేస్తున్న సంఘాలు నాయకులపై తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. కార్యక్రమంలో బహుజన విద్యార్ధి సంఘాలు ప్రతినిధులు వేల్పుల సంజరు, పులిగంటి వేణు గోపాల్, కొత్తపల్లి తిరుపతి,అంబేద్కర్ విద్యార్థులు పాల్గొన్నారు.