Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
జాతీయ స్థాయిలో తెలుగు ప్రాంత ఇంద్రజాలికులు గుర్తింపు పొందారని ప్రముఖ సీనియర్ ఇంద్రజాల కళాకారుడు బి. ఎన్ ఎస్. కుమార్ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై బుధవారం తెలుగు మెజిషియన్స్, హైద్రాబాద్ మెజిషియన్స్, తెలంగాణ మ్యాజిక్ అకాడమీ, ఆనంద లహరి సంయుక్త నిర్వహణలో విఖ్యాత ఇండ్రజాలికులు పీసీ సర్కార్ జయంతి సందర్భంగా ఇంద్రజాలికుల దినోత్సవం జరిగింది. కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఇంద్రజాలం కూడా కళా ప్రక్రియేనన్నారు. అంతర్జాతీయంగా ఆదరణ ఉందని మన దేశంలో ఇంకా అభివద్ధి చెందాల్సి ఉందన్నారు సర్కార్ సీనియర్ జూనియర్ ఇద్దరు ఈ కళ వ్యాప్తికి విశేష కషి చేశారని గుర్తు చేశారు. అధ్యక్షత వహించిన బాల సాహిత్య రచయిత చొక్కాపు రమణ మాట్లాడుతూ సర్కార్ స్ఫూర్తిని నేటి యువ ఇండ్రజాలికులు కొనసాగించాలని కోరారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి, మెజిషియన్స్ అలీ, రామడుగు వసంత్, ప్రదీప్, రఘు బాబు, ఆంజనేయులు తదితరులు తమ ఇంద్రజాల ప్రదర్శనతో ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచారు. మర్రి రమేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే రోజుల్లో భారీగా ఇంద్రజాల ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.