Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సంస్కత భాషలో ఊరు కు తెలుగులో తొడ అని. వ్యాస భారతం మొత్తం పాండవుల కేంద్రీకతంగా కధ నడుస్తుంది. భాసుడు సంస్కతంలో ' ఊరు భంగం' నాటకాన్ని సంస్కతంలో దుర్యోధనుని ప్రధాన భూమికగా రచించారు. ఈ నాటకాన్ని సాయి కార్తీక్ తెలుగులోకి నటకీకరించారు. తెలుగు నాటకాన్ని పరి రక్షించాలనే సదుద్దేశంతో టిక్కెట్‌పై నాటకం అనే నినాదంగా ఏర్పడిన 'రసరంజని' నాటక సంస్థ కారోన విపత్కాలంలో దాదాపు రేడు ఏళ్ల విరామం తర్వాత 'ఊరు భంగం' నాటకం రవీంద్రభారతి ప్రధాన వేదికపై బుధ వారం ప్రదర్శితమైంది. రామ్మోహన హాలగుంది దర్శకత్యంలో ప్రదర్శితమైన ఈ నాటకం కురుక్షేత్ర యుద్ధ ముగింపు కొచ్చిన తరుణంలోనే భీముడు గదయుద్ధం లో దుర్యోధనుని తొడలు విరగ కొట్టగా, దుర్యోధనుడిని ఆవేదన, ఆక్రోశం, పశ్చాత్తాపం, జీవకోటికి యుద్ధం వల్ల కలిగే అనర్ధాలను వివరించటం వంటి సంఘటనలు కథాంశం. నాటకంలోని పాత్రధారులు శిక్షణ శిబిరం శిక్షణ పొందిన యువ కళాకారులు. వారి ఆహార్యం, నటన తో పాటు రంగాలంకరణ విభిన్నంగా ఉండి ప్రయోగాత్మక ప్రదర్శనగా నిలిచింది.