Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
దశాబ్దాలుగా అణిచివేతకు గురైన దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన వినూత్న పథకమే దళిత బందు పథకమని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుధవారం అంబర్‌పేటలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో దళిత బందు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యేకాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజరుకుమార్గౌడ్ హాజరయ్యారు. అంబర్‌పేట నియోజకవర్గంలో వెయ్యి నుంచి రెండు వేల మంది లబ్ధిదారులను గుర్తించి దళిత బందు పథకాన్ని అందజేస్తామని చెప్పారు. పథకానికి అర్హులైన లబ్ధిదారుల వయస్సు 21 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలని, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం వర్తింసుంతనిద వెల్లడించారు. లబ్దిదారులు తమకు ఆదాయాన్ని అందించే అవసరమైన వస్తు సామగ్రీకి పథకం ద్వారా పెట్టుబడి అందిస్తామని పేర్కొన్నారు. దీర్ఘ కాలిక ప్రయోజనాలను దష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రమాద, అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా పథకానికి ఎంపికైస లబ్లీదారునికి 10 లక్షల బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బీసీడీవో ఆశన్న, ఏడీడీ డిస్ట్రిక్ ఇండిస్టీస్ నవీన్, ఎస్స్సి కార్పొరేషన్ ఈడీ రమేష్, తహశీల్దార్ వేణుగోపాల్‌తో పాటు పలువురు అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.