Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్కిల్- 14 ఏఎంహెచ్‌వో డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
గోషామహల్ సర్కిల్ -14 పరిధిలోని ప్రతి డివిజన్ ప్రతి బస్తీ, కాలనీ పరిశుభ్రంగా ఉండేట్లు చూస్తున్నామని జీహెచ్ఎంసీ గోషామాల్ సర్కిల్ -14 ఏఎంహెచ్‌వో డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం ఏఎంహెచ్‌వో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడిచెత్తను వేర్వేరుగా డబ్బాల్లో వేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై మూత్ర విసర్జన చేస్తే ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. తమ సర్కిల్లో 92 ఆటోల ను చెత్త సేకరణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై చెత్త వేయడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అని కోరారు. తమ సర్కిల్ పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయని కార్పొరేటర్లు సహకరించాలని కోరారు.