Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్/జూబ్లీహిల్స్/అంబర్‌పేట
స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా అని మనరజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దవూరే బ్రహ్మయ్య తెలిపారు. మన రజక సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా146వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బ్రహ్మయ్య హాజరై గాడ్గే బాబా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమకాలీనుడు, సామాజిక న్యాయం, సమానత్వం, సామాజిక సమరసతా విధానం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు అని కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర యువతరానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో నాగిళ్లగిరి కుంచాల బ్రహ్మయ్య, అనిల్ రజక, రమణ చారి, శరత్, అరవింద్, విజరు, పవన్, నవీన్, అఖిల్, రమేష్, సాయి కుమార్, ప్రదీప్, నరసింహ, చంద్రశేఖర్, రాజు, శీను తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రజక వత్తిదారుల సంఘం జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 146 వ జయంతి వేడుకలను రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లో ఘనంగా నిర్వహించారు. జోన్ కార్యదర్శి బిక్షపతి సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మూఢనమ్మకాలకు, అంటరానితనానికి వ్యతిరేకంగా, మనుషులంతా సమానమే అని నిస్వార్ధంగా సేవ చేసిన ఆయన ఆశయాలు మనమందరం కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో రజక వత్తిదారుల సంఘం నాయకులు సుధాకర్, అశోక్, సీఐటీయూ నాయకులు ఏ ఆర్ నరసింహ, భాగ్యరాజు, లక్ష్మణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అపరిశుభ్రతతే అన్ని రోగాలకు కారణమని దాని నిర్మూలనకు స్వచ్చ భారత్ ఉద్యమ నిర్మించిన సంత్ గాడ్గే బాబా సేవలు భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు పుట్టి యాదగిరి ముదిరాజ్ అన్నారు. స్వచ్చ భారత్ ఉద్యమ నిర్మాత, రజకుల ఆణి ముక్యం సంత్ గాడ్గే బాబా 146వ జయంతి వేడుకలు అఖిల భారత దోభీ రజక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వీరేశం అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. పుట్టి యాదగిరి ముదిరాజ్ సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. నేటి యువత సంత్ గాడ్గే బాబా మహారాజ్ సేవలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షుడు ఎర కృష్ణ, చులకల శంకర్, కోశాధికారి అప్పారావు, అక్కేనపల్లి లక్ష్మినారాయణ, భజరంగ్‌దళ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యమన్‌సింగ్, కాశిబుగ్గ దేవస్ధానం అధ్యక్షుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు.