Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
నవతెలంగాణ-ధూల్‌పేట్
నాయీ బ్రాహ్మణుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సిటీ కళాశాల కులీకుతుబ్‌షా మైదానంలో నాయీ బ్రాహ్మణ యువశక్తి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్ పోటీల్లో గెలిచిన సనత్ నగర్ సీసీ జట్టుకు ట్రోఫీ, నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కుల హక్కులతో పాటు, క్రీడా రంగంలో రాణించాలని కోరారు. నాయీ బ్రాహ్మణులకు ఆత్మగౌరవ భవనం, భూమి పత్రాలు అందించి, నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యువశక్తి రాష్ట్ర అధ్యక్షుడు వికాస్ కుమార్, ప్రధాన కార్యదర్శి వల్ల జి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పరమేష్, కోశాధికారి చంద్రశేఖర్, ఆంజనేయులు, ఎస్ క్రాంతి, వేణుమాధవ్, మనోహర్, కే శివకుమార్, గణేష్, భీమ్ రాజ్, బిక్షపతి, పి శ్యామ్, శ్రీకాంత్, బాబ్జి ఆత్మగౌరవ భవనం ఫస్ట్ చైర్మెన్ పి శ్రీనివాస్, యువశక్తి నాయకులు పాల్గొన్నారు.