Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆవాజ్ సౌత్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ సత్తార్
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్ర బడ్జెట్ 2022-23లో మైనార్టీ సంక్షేమానికి రూ. 5వేలు కోట్లు కేటాయించాలని ఆవాజ్ సౌత్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ సత్తార్ డిమాండ్ చేశారు. సౌత్ కమిటీ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ మైనార్టీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీల సమస్యలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిన్న వత్తులు చేసుకునే వారికి, వీధి వ్యాపారులకు, మహిళలు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. మైనార్టీ సంక్షేమానికి 2020-21 బడ్జెట్లో 1973 కోట్లు కేటాయించగా 1523 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. 2021-22 బడ్జెట్లో రూ.1602 కోట్లు మాత్రమే కేటాయించారని, గత ఏడాది కంటే రూ.370 కోట్ల కేటాయింపులో కోత విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో మూడో త్రైమాసికానికి రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు నామమాత్రం మెనని, బహుళ రంగాల అభివద్ధికి కేటాయింపులు గతేడాది కంటే రూ.30 కోట్లు తగ్గాయన్నారు. దీంతో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్థిక సాయం నిలిచిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల బడ్జెట్లు ఖర్చు చేసిందని, అయితే మైనార్టీలు జనాభాలో 15 శాతంగా ఉన్నారన్నారు. మైనార్టీ సంక్షేమ బడ్జెట్ రూ. 6.500 కోట్లకు మించలేదని, ఇది చాలా అన్యాయమాన్నారు. ఉపకార మైనార్టీ గురుకులాలు మినహా మైనార్జీ సంక్షేమానికి పెద్దగా కేటాయింపులు లేవన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలకు గురవుతుంటే నిధుల కొరత, సరైన ప్రభుత్వ విధానం లేకపోవడంతో భూముల సర్వే ఆగిపోయిందన్నారు. డ్రైవర్ సాధికారత పథకం, డ్రైవర్ కమ్ ఓనర్ పతకాలు ప్రారంభమై నిలిచిపోయాయన్నారు. ఆర్థికంగా చితికపోయిన, విద్యాపరంగా, వెనుకబడిన మైనార్టీలు అభివద్ధి చెందాలంటే బడ్జెట్‌ను పెంచకుండా చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్ నివేదిక కూడా ఇదే చెబుతోందని, తప్పుడు వాగ్దానాలతో మభ్యపెట్టకుండా మైనార్టీల అభివద్ధికి ప్రభుత్వం నిజాయితీగా కషి చేయాలన్నారు. 2022-23 బడ్జెట్లో రూ. 5000 కోట్లు కేటాయించాలని, మైనార్టీ బంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టి యువత, మహిళలు, చిరు వ్యాపారులకు ఉద్యోగాల కల్పనకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.