Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హైదరాబాద్ నగరంలో యాదవ హాస్టల్ నిర్మాణానికి పూనుకున్నామని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబూరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్ వెల్లడించారు. బుధవారం యాదవ మహాసభ విద్యావంతుల వేదిక కన్వీనర్ చలకాని వెంకట్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవులు విద్యా రంగంలో ఉన్నత శ్రేణికి చేరుకునే లక్ష్యంతో హాస్టల్ నిర్మాణానికి పూనుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 17 శాతంగా ఉన్న యాదవులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన వాటా దక్కడం లేదన్నారు.గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే ప్రతి ఒక యాదవ విద్యార్థికి హాస్టల్ అండగా ఉండేందుకే యాదవ విద్యావంతుల వేదిక నిర్ణయం తీసుకుందన్నారు. అఖిల భారత స్థాయిలో చదువు, ఉద్యోగాల్లో రాణింపజేసేల నిలబడేందుకు కషి చేస్తామన్నారు. సుమారు పది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో యాదవ వసతి గహం నిర్మిచాలని నిర్ణయించిన నేపథ్యంలో బద్దుల బాబురావు, చింతల రవిందర్, ధారబోయిన శ్రీను, చిర్రబోయిన బధ్రినాధ్, బద్దుల ప్రశాంత్ యాదవ్ తదితరులు రూ.11 లక్షల నుంచి అయిదు లక్షల వరకు విరాళాలు ప్రకటించారని వారు తెలిపారు. వీరే కాకుండా అనేక మంది విద్యావంతులు ఒక్కరోజే రూ.73 లక్షల విరాళాలు సేకరించారని వివరించారు. యాదవ హాస్టల్ నిర్మాణానికి విద్యావంతులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యాదవ మహాసభ నాయకులు ఎ.అజరు కుమార్, రమేష్ బాబు, ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, ఎం.గోపాల్ యాదవ్, గొర్ల యశ్వంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.