Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్
నవతెలంగాణ-అడిక్మెట్
గాంధీనగర్ డివిజన్ వై జంక్షన్ నుంచి బాలాజీ ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వరకు ఇటీవలే ప్రారంభించిన నూతన సీసీ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి ప్రజల అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నామని కార్పొరేటర్ పావని వినరు కుమార్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఇంజినీర్ సన్నీతో కలిసి రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో నర్మద హాస్పిటల్ రోడ్డు పనులను వాటితో పాటు పెండింగ్లో ఉన్న మరికొన్ని అభివధ్ది పనులను మొదలుపెట్టి సకాలంలో పూర్తి చేసేందుకు కషి చేస్తున్నట్లు తెలిపారు. డివిజన్ అభివద్ధి కోసం చేసే పనుల్లో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని వివరించారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు వినరు కుమార్, ఎం.ఉమేష్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, శివరథన్, అభిషేక్, షేశాంక్, సాయి తేజ పాల్గొన్నారు.