Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో నూతన పైప్లైన్ల నిర్మాణంతో వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బుధవారం కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ రజక కాలనీలో రూ. 6.69 లక్షలతో డ్రయినేజీ పైప్ లైన్, కట్ట మైసమ్మ దేవాలయం లైన్లో రూ. 6.89 లక్షలతో వాటర్ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ రచన శ్రీతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన పైప్ లైన్ల నిర్మాణంతో వరద నీటి, మంచి నీటి కలుషితం సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యావత్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 15,71,050 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహ, డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, రామ్ చందర్, రాజశేఖర్, జమాలుద్దీన్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్, బీజేపీ నాయకులు వెంకటేష్ మహేందర్, అధికారులు సుబ్బారాయుడు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.