Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.శైలజ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఈ నెల 27న చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ చేస్తున్నట్లు కోఠి రీజినల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్ఎఫ్పీటీసీ) యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి. శైలజ అన్నారు. బుధవారం ఆస్పత్రిలో ఆమె మాట్లాడుతూ 27న తమ ఆస్పత్రి పరిధిలో 30 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు అందిస్తామని తల్లిదండ్రులకు సూచించారు. దగ్గు, జ్వరం,జలుబు సమస్యలు ఉన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తీసుకోరాదన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.