Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి అదశ్యమయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌కు చెందిన షేక్ మస్తాన్ (47) తన భార్య షమీమ్ బేగం, ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 15న బతుకుదెరువుకోసం నగరానికి వచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెం 13లోని ఓ ప్రయివేటు భవనం వద్ద వాచ్‌మెన్‌గా చేరిన మస్తాన్ ఈనెల 21న మద్యాహ్నం అక్కడినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రెండ్రోజులు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో మస్తాన్ భార్య షమీమ్ బేగం బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిసిన వారు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.