Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డైకిన్ వైస్ ప్రెసిడెంట్ సంజరు
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీదారు సంస్థ డైకిన్ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తూ దేశ ప్రజల మన్ననలు పొందుతుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ సంజరు గోయల్ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల మేనేజర్ గణేష్ రావు తో కలిసి మాట్లాడారు.. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను దష్టిలో ఉంచుకుని ఫోర్ స్టార్ సెగ్మెంట్‌తో కొత్త రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులు గాలినాణ్యత, ఆరోగ్యం, అధిక కస్టమర్ ప్రాధాన్యతలను దష్టిలో ఉంచుకొని రూపొందించామని తెలిపారు. వీటి ద్వారా 15 శాతం విద్యుత్‌ను ఆదా చేయడంతోపాటు, క్లాగ్ ఫ్రీ ఆపరేషన్ కోసం డ్యూ క్లీన్ టెక్నాలజీ, గాలి నాణ్యత కోసం స్త్రీమర్ డిశ్చార్జ్ టెక్నాలజీ, వేడి చల్లని ఆపరేషన్ కోసం తక్కువ కాస్ట్ హీట్ పంప్ లతో పాటు సులువుగా హ్యాండిల్ చేసేందుకు వైఫై ఆప్షన్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పీఎల్ఐ పథకంలో భాగంగా ఏసీల విడిభాగాల తయారీ కోసం తమ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో భూమిని కొనుగోలు చేసి 1000 కోట్ల పెట్టుబడి పెట్టిందని తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి ఈ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు.