Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిందితుడి అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిషేధిత పోగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి ఆరులక్షల విలువగల గుట్కా ప్యాకెట్లు, విదేశీ సిగరేట్లతోపాటు ద్విచక్రవాహనం, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. గురువారం డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాల మేరకు డీడీ కాలనీలో నివాసముంటున్న గోలి రంజిత్‌కుమార్ పాన్ మసాలా వ్యాపారం చేస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదిం చాలని సుల్తాన్‌బజార్‌కు చెందిన ఎండీ ఫయాజ్, కిషన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ పోగాకు ఉత్పత్తుల వ్యాపారులతో చేతులు కలిపాడు. వారి నుంచి తక్కువ ధరకు పోగాకు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న నిందితుడు వాటిని నల్లకుంటలో అద్దెకు తీసుకున్న గోదాంలో నిల్వచేస్తున్నాడు. కిరాణం దుకాణాలు, పాన్‌దుకాణాలు, కావాల్సిన వారికి అధిక ధరలకు సరఫరా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్ నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలోవున్న వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. ఎవరైనా నిషేధిత పోగాకు ఉత్పత్తులను విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని డీసీపీ హెచ్చరించారు.