Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సరూర్‌నగర్
రంగారెడ్డి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఆర్కెపురం డివిజన్‌కు చెందిన టీిఆర్‌ఎస్ మహిళా నాయకురాలు ఉరుపక్క మాధవి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్‌శర్మ, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ వీరమళ్ల రామ్ నర్సింహగౌడ్లు శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులకు ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిరెళ్లి వెంకట్ రెడ్డి, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, మారోజు రమాచారి, కొండ్ర శ్రీనివాస్, కంచర్ల శేఖర్, పదిరి శంకర్, మహిళ నాయకు రాలు చిట్టెడి పుష్పాలతరెడ్డి, యాదమ్మ, కనకలక్ష్మి, యశోదమ్మ, సైద బెగం, కౌశల్య, ప్రమీల, రుకియా బేగం, నిరుడు యాదమ్మ, యండి చోటు, తదితులున్నారు.