Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీసుల అదుపులో నిర్వాహకులు
నవతెలంగాణ - అడిక్‌మెట్
విఆర్విత్ యు ఫౌండేషన్ పేరుతో విద్యార్థుల స్కూల్ ఫీజులు కడతామని మోసాలకు పాల్పడుతున్న ఫౌండేషన్ నిర్వాహకులను నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీఆర్విత్ యు అనే ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్రవంతి, శ్రీధర్‌లు ఫౌండేషన్ పేరుతో అమాయకులను మోసం చేస్తూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న చిన్నాచితకా కుటుంబాలను టార్గెట్ చేసి మీ పిల్లల స్కూలు, కాలేజీ ఫీజుల విషయంలో ముందుగా 50శాతం విద్యార్థులు కడితే మిగతా 50శాతం ఫౌండేషన్ ద్వారా నెల తర్వాత తాము కడతామని నమ్మించి 70 కుటుంబాలకు పైగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి 50 శాతం ఫీజులు వసూలు చేసి గత కొన్ని నెలలుగా మోసాలకు పాల్పడుతూ 14 లక్షల రూపా యలు వసూలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా స్కూల్ ఫీజ్‌లు కడతామంటూ పలుమార్లు దాట వేశారు.
నెలలు గడుస్తున్నా ఫీజులు చెల్లించక పోవడంతో న్యాయం చేయాలంటూ పదుల సంఖ్యలో బాధిత కుటుంబాలు స్థానిక నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఫౌండేషన్ నిర్వాహకులు స్రవంతి, శ్రీధర్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.