Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కుషాయిగూడ డిపోలో సికింద్రాబాద్ ఆర్ఎం జి.యుగేందర్, డీవీఎం జగన్ రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మహా శివరాత్రి కీసరగుట్ట జాతర సంద్భంగా జంటనగరాల ప్రజల కొరకు 27 నుండి 40 వరకు సికింద్రాబాద్ బ్లూసీ పాయింట్, తార్నాక, అమ్ముగూడ, అల్వాల్, ఉప్పల్, ఘట్కేసర్, అఫ్జల్‌గంజ్, ఇ.సి.ఐ.ఎల్, కుషాయిగూడ ప్రాంతాల నుండి 200 వందల ప్రత్యేక బస్సులు 24 గంటలు నడుపుటకు నిర్ణయించారు. డీవీఎం జగన్ మాట్లాడుతూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండ బస్ స్టాండ్లలో మెడికల్ క్యాంపు, మంచి నీరు, సమాచారం ఇచ్చుటకు 24గంటలు ఎంక్వయిరీ కౌంటర్లు, సిబ్బందితోపాటు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని, ప్రజలు ప్రైవేటు వాహనాలతో ట్రాఫిక్‌లో ఇబ్బందిపడే కన్న ఆర్టీసీ బస్సులో సుఖవంతమైన-సురక్షితమైన ప్రయాణం ఎంచుకొని శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని సుఖంగా ఆర్టీసీలో తిరుగు ప్రయాణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని కుషాయిగూడ, చెంగిచెర్ల, కంటోన్మెంట్, రాణిగంజ్, హకీంపెట్ల డిపో మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్లు పాల్గొన్నారు.