Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
నవతెలంగాణ-ఉప్పల్
కల్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు వరం అలాంటిదని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ అన్నారు. కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడపడుచుల పెళ్ళిళ్ళకి ఎంతో ఉపయోగపడు తున్నాయి అని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అందిస్తున్న వరం అని అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు డివిజన్లకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్ మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపించే తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఇంటికీి ముఖ్యమంత్రి కేసీిఆర్ పెద్ద దిక్కు అయ్యాడని, చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందభాష్పాలను చూశామన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బింగి శ్రీనివాస్, బాలు కొల్లూరి సాంబరాజు, అధిక సంఖ్యలో మహిళలు, లబ్దిదారులు పాల్గొన్నారు.