Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
విద్యతో పాటు క్రీడా రంగాల్లో రాణించాలని, యువత దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం డిస్ట్రిక్ట్ యూత్ సమ్మేళన కార్యక్రమం నెహ్రూ యువ కేంద్ర హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత మంచి మార్గాన్ని ఎంచుకుని దేశం గర్వపడేలా ఉండాలని అని ఆయన కోరారు. యువత చెడు మార్గంలోకి వెళ్ళకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కొంతమంది యువత గంజారు మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని, మంచి మార్గాన్ని ఎంచుకుని దేశం, రాష్ట్రం గర్వపడేలా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, కుమార్ గుప్తా, ఈశ్వరరావు, భీమ్ రెడ్డి కుష్బు గుప్తా, పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొన్నారు.