Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
సులభంగా అక్రమ మార్గంలో ధనార్జనే ధ్యేయంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన తిరుమలగిరి పోలీసులు నిందితుల నుండి 32వేల విలువైన కిలో గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండల డీసీపీి చందనాదీప్తి మాట్లాడుతూ యువతను, విద్యార్థు లను లక్ష్యంగా చేసుకుని గంజాయి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రాజు గిరిధారి ఖైబర్త్, షాబార్లు అక్రమ మార్గాల ద్వారా గంజాయిని సికింద్రాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒరిస్సాకు చెందిన ముగ్గురు వ్యక్తులు టీ స్టాల్ నడుపుతూ గంజారుకి బానిసగా మారి సులభంగా డబ్బు సంపాదించడం కోసం గంజాయి విక్రయించేందుకు ముఠాగా ఏర్పడ్డారని డీసీపీ తెలిపారు.. సికింద్రాబాద్ లాల్‌బజార్, బోయిన్పల్లి ప్రాంతాలకు చెందిన మహేష్ కుమార్, అన్వర్‌లకు ఒరిస్సాకు చెందిన ముగ్గురు సభ్యులు జత కలిసి గంజాయి విక్రయించి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకునేవారని పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన తిరుమలగిరి పోలీసులకు ఉత్తర మండల డీసీపీ చందనాదీప్తి రివార్డులను ప్రకటించారు. చీర సుచిత్ర శ్రీకాంత్, కుమార్ గుప్తా, ఈశ్వరరావు, భీమ్ రెడ్డి కుష్బు గుప్తా, పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొన్నారు.