Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-బేగంపేట్
అన్ని రకాల మొక్కలు వాట్ ఎక్విప్మెంట్స్ ఒకే చోట లభించడం ఆనందదాయకం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న పీపుల్స్ ప్లాజాలో 11వ గ్రాండ్ నర్సరీ మేళాను గురువారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... దేశంలోని నర్సరీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ నర్సరీ మేళా లో మన హైదరాబాద్‌కు వచ్చి వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క నర్సరీకి వెళ్లి కొనాలంటే కొనలేము. దేశంలో పలు రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఈ నర్సరీ మేళాలో వారు మొక్కలను ఇక్కడ పెట్టడం వల్ల హైదరాబాద్ ప్రజలు ఇక్కడికి వచ్చి వారికి ఎటువంటి పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్ అవసరమైనటువంటి అన్ని ఇతర ఎక్విప్మెంట్స్ కూడా ఒకే దగ్గర చూసి వారికి ఇష్టమైనవి కొనుగోలు చేయుటకు ఎంతగానో వెసలుబాటు కలుగుతోంది. ముఖ్యంగా సెల్ ఫోన్లు, టీవీలు, ఈ కాంక్రీట్ జంగిల్లో ఒత్తిడిలో పనిచేసే వాళ్లకు ఇలాంటి గార్డన్స్ నూతన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తూ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఖాలీద్ అహ్మద్ ఈ మేళాను 11వసారి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అందరు కూడా ఇక్కడికి వచ్చి నర్సరీలో వారి స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేళా 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. జంట నగర ప్రజలందరూ కూడా ఇష్టమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు నచ్చినటువంటి ప్లాంట్ మొక్కలు కానీ, అదే విధంగా మొక్కలు పెంచడానికి అవసరమైన రకరకాల పాండ్స్ కానీ, అస్సాం నుంచి వెదురు బొంగులతో చేసిన అద్భుతమైన పాండ్స్, అదేవిధంగా మట్టితో చేసినవి, ప్లాస్టిక్‌లో కూడా రకరకాల బొమ్మలు వచ్చాయి. రాయిలాగా కనబడుతూ ఉండే విధంగా ఉన్న చక్కని పాండ్స్ కూడా చూశానని ఆయన చెప్పారు. అన్ని రకాల మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరి ప్రజలు ఎవరికి ఇష్టమైన వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చేసి మీకు నచ్చిన మొక్కలు తీసుకోవచ్చు ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహిస్తున్నాం. 11వ సంవత్సరం హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి కూడా బాగా కనబడాలంటే మున్సిపాలిటీల్లో గ్రామపంచాయతీలో కూడా రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ కార్యాలయాల ముందు కూడా చక్కటి పూలమొక్కలు, మంచి మొక్కలు కూడా చూడడం జరిగింది. నేను కూడా మా ఇంటికీ, మున్సిపాలిటీకి తీసుకువెళ్లడానికి మా కమీషనర్‌ను, కౌన్సిలర్లను పిలిచాను. వారు కొన్ని ప్లాంట్స్‌ను ఎన్నుకున్నారని మంత్రి తెలిపారు.