Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండీ దానకిశోర్ను కలిసిన సంఘం ప్రతినిధులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలిలో నూతన ఉద్యోగ సంఘం ఆవిర్భవించింది. యు నైటెడ్ హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ ఎంప్లా యీస్ విజనరీ వెల్ఫేర్ అసోసి ియేషన్ పేరుతో ఈ నూతన సంఘం ఏర్పడింది. అధ్యక్షునిగా జి.విశ్వనాథన్, ప్రధాన కార్యదర్శిగా వై.నాగేశ్వరరావు, సలహాదారులుగా మహేశ్ కుమార్, టీవీ లక్ష్మణ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా రఘునాథ్ రెడ్డి, కోశాధికారిగా హరీశ్ చంద్రప్రసాద్, ఈసీ సభ్యులుగా జనార్ధన్, రామకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన సంఘం కమిటీ సభ్యులు జలమండలి ఎండీ దానకిశోర్ను మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని, జలమండలి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. నూతన సంఘం ఏర్పాటుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.