Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొయువత వాటికి దూరంగా ఉండాలి
ొమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ొనార్త్జోన్ డీసీపీ ఆధ్వర్యంలో
డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు
నవతెలంగాణ-కంటోన్మెంట్
మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాలు ఛిద్రమవుతాయని, యువత, ప్రజలు వాటికి దూరంగా ఉండాలని పశుసంవర్ధక, సినిమా ఫొటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నార్త్ జోన్ పరిధిలోని బాలంరాయి క్లాసిక్ గార్డెన్లో డీసీపీ చందనా దీప్తి అధ్యక్షతన హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, పానీయాలకు అలవాటు పడితే వారు జీవితం నాశనం అవుతుందన్నారు. విద్యార్థులు, యువత వీటికి దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్‌కు బానిసలు కానివారు సమాజ అభివృద్ధికి దోహదపడినవారవుతారని చెప్పారు. సిటీలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని, వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసినా, వాడినా ఉపేక్షించేది లేదని, పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపుతారని చెప్పారు. అంతకుముందు సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... డ్రగ్స్ నిర్మూలన దిశగా కఠినంగా వ్యవహరిస్తామని, గోవా, ముంబాయి నుంచి గంజాయి, మత్తు పదార్థాలు హైదరాబాద్‌కు సరఫరా అవుతుండడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని వివరించారు. పిల్లలు మత్తుకు, డ్రగ్స్‌కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు అలర్టుగా ఉండాలన్నారు. ఒక్కసారి డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితంలో ఏ విధంగా నష్టపోతారో వివరించారు. సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ... మత్తు జీవితాలను చిత్తు చేస్తుందని, దూరంగా ఉండాలని సూచించారు. తాను సిగరెట్‌కు అలవాటుపడి ఎంతో నష్టపోయానని తెలిపారు. తర్వాత డాక్టర్ల సలహాతో సిగరెట్ కాల్చడం మానేశానని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, సెలబ్రిటీలు డ్రగ్స్‌వల్ల కలిగే అనర్థాలపై తమ తమ శైలిలో సందేశాలు ఇచ్చారు. కార్యక్రమం సందర్భంగా బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ముప్పిడి గోపాల్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు ఎమ్మెల్యే, సీపీ, డీసీపీలను సన్మానించారు. సదస్సులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, ప్రముఖ గాయకులు, జంట నగరాల పోలీస్ ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్ఐలు, కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.