Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కరోనా సమయంలోనూ, అన్ని సందర్భాల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ వందనాలు తెలియజేస్తున్నానని, ఆశావర్కర్ల సేవలు ఎంతో గొప్పవని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ ఏడులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలోని ఆశా వర్కర్లకు ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నే కవితారెడ్డిలతో కలిసి స్మార్ట్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఆశావర్కర్ల సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి ఆరోగ్య సమాచారంతోపాటు మహిళలు, గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలసుకుంటూ ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ఆశావర్కర్లకు సెల్ఫోన్లను పంపిణీ చేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్‌ను ప్రాంరంభించి జాతికి అంకితం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రాములు చౌహాన్, ప్రధాన కార్యదర్శి ఆనంద్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.