Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పెండింగ్ పైపులైన్ నిర్మాణ పనులను పూర్తి చేసి మంచినీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్ నారాయణగూడ జల మండలి జనరల్ మేనేజర్ సుబ్బారాయుడును కోరారు. గురువారం జల మండలి జనరల్ మేనేజర్ సుబ్బారాయుడును కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్ కలిసి వాటర్ పైపులైన్ పెండింగ్ పనులపై చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నింబోలి అడ్డా నుంచి గోల్నాక బ్రిడ్జి వరకు మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులను ఆగిపోవడంతో ప్రజలు మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని అన్నారు. నింబోలి అడ్డా, నెహ్రునగర్, సుందర్‌నగర్, నవాబ్సాబ్వాడ, కృష్ణానగర్, న్యూకృష్ణానగర్, వడ్గీకార్కానా, శాంతినగర్ ప్రాంతాలలో మంచనీటి సమస్యతో స్ధానికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.